సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సమంతని second hand item అన్న నెటిజన్! ఆమె రిప్లై ఏంటంటే...

ABN, First Publish Date - 2021-12-22T03:36:10+05:30

సొషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలకు ఎంత లాభం చేకూరిందో అంతే ఇబ్బంది కూడా కలుగుతోంది. మరీ ముఖ్యంగా, వారి వ్యక్తిగత విషయాలు రచ్చగా మారిపోతున్నాయి. ఇక సినిమా హీరోయిన్స్ సంగతైతే చెప్పేదే లేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సొషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలకు ఎంత లాభం చేకూరిందో అంతే ఇబ్బంది కూడా కలుగుతోంది. మరీ ముఖ్యంగా, వారి వ్యక్తిగత విషయాలు రచ్చగా మారిపోతున్నాయి. ఇక సినిమా హీరోయిన్స్ సంగతైతే చెప్పేదే లేదు. వారికి ప్రైవెసీ అంటూ ఒకటి ఉంటుందనే చాలా మంది మర్చిపోతుంటారు. గౌరవం ఇవ్వాలని కూడా కొంత మంది నెటిజన్స్‌కు బుద్ది పుట్టదు. సమంతకి కూడా అటువంటి అనుభవమే ఇప్పుడు ఎదురైంది. 


‘‘విడాకులు తీసుకున్న, పాడుబడ్డ, సెకండ్ హ్యాండ్ ఐటెం’’... ఇలా సమంతని వర్ణించాడు ఓ యూజ్‌లెస్ ట్విట్టర్ యూజర్. ఇంగ్లీష్‌లో ఎగ్జాక్ట్‌గా అతను అన్న మాటలు ఏంటంటే ‘డైవోర్స్డ్, రుయిన్డ్, సెకండ్ హ్యాండ్ ఐటెం’. అంతే కాదు, ‘‘ఓ జెంటిల్‌మ్యాన్ నుంచీ దోచుకున్న యాభై కోట్ల ట్యాక్స్ ఫ్రీ మనీ ఆమె (సమంత) వద్ద ఉంది...’’ అంటూ అర్థంపర్థం లేని కూతలు కూడా రాశాడు. అయితే, తనపై పిచ్చిపిచ్చిగా కామెంట్ చేసిన సదరు నెటిజన్‌కి సామ్ ఎవరూ ఊహించని రిప్లై ఇచ్చింది. ‘‘గాడ్ బ్లెస్ యువర్ సోల్’’ అంటూ ఆమె సమాధానం ఇచ్చింది!


నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం తరువాత ఆన్‌లైన్‌లో సామ్‌పై మాటల దాడులు ఎక్కువయ్యాయి. చాలా మంది ఆమెదే తప్పంటూ నోటికొచ్చిన రాతలు రాసేస్తున్నారు. ఇష్టానుసారం ట్రోల్ చేస్తున్నారు. ‘పుష్ప’ మూవీలో సమంత ఐటెం సాంగ్ తరువాత వాళ్ల జోరు మరింత పెరిగింది...       

Updated Date - 2021-12-22T03:36:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!