చైతన్యా.. నా గురించే ఆలోచిస్తున్నావా: సమంత

ABN , First Publish Date - 2021-01-18T16:29:37+05:30 IST

అక్కినేని హీరో నాగచైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోకు సమంత చేసిన చిలిపి కామెంట్ వైరల్‌గా మారింది.

చైతన్యా.. నా గురించే ఆలోచిస్తున్నావా: సమంత

అక్కినేని హీరో నాగచైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోకు సమంత చేసిన చిలిపి కామెంట్ వైరల్‌గా మారింది. తాజాగా నాగచైతన్య తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. `థ్యాంక్యూ` సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తీసిన ఫొటో అది. ఆ ఫొటో చైతూకు బాగా నచ్చింది. దాన్ని ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 


ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో చైతు దీర్ఘాలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. దీంతో పలువురు నెటిజన్లు ఆ ఫొటోపై కామెంట్లు చేస్తున్నారు. చైతూ భార్య సమంత కూడా ఆ ఫొటోపై స్పందించింది. `నువ్వు నా గురించే అలోచిస్తున్నావా?` అంటూ ఫన్నీ కామెంట్ చేసింది. సమంత కామెంట్ చాలా మందిని ఆకట్టుకుంది. 



Updated Date - 2021-01-18T16:29:37+05:30 IST