సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Samantha ఇకపై నా పని నేనే చేసుకోవాలి

ABN, First Publish Date - 2021-10-04T21:23:01+05:30

ప్రస్తుతం ఎక్కడ చూసినా నాగచైతన్య–సమంతల విడాకుల గురించే చర్చ నడుస్తోంది. కొన్ని నెలలుగా వీరిద్దరూ విడిపోబోతున్నారని వార్తలు వస్తున్న ఏ ఒక్కరూ పెదవి విప్పలేదు. ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నాం ఈ జంట తమ విడాకుల విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం ఎక్కడ చూసినా నాగచైతన్య–సమంతల విడాకుల గురించే చర్చ నడుస్తోంది. కొన్ని నెలలుగా వీరిద్దరూ విడిపోబోతున్నారని వార్తలు వస్తున్న ఏ ఒక్కరూ పెదవి విప్పలేదు. ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నాం ఈ జంట తమ విడాకుల విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి. చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నామని చె–సామ్‌ తెలిపారు. అయితే వీరిద్దరి విడాకుల వ్యవహారాన్ని అభిమానులే కాదు నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా సమంత తమ విడాకుల ప్రకటన తర్వాత తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘‘ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు నన్ను నేను మార్చుకోవాలి. నా పడకగదిని నేను సిద్థం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మధ్యాహ్నాం వరకూ నిద్రపోకూడదు. ఇక, పగటి కలలు కనడం మాని చేయాల్సిన పనుల పైనే దృష్టి పెట్టాలి’ అని ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశారు సామ్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.




ఖుష్బూ స్పందన...

సమంత విడాకుల పట్ల సీనియర్‌ నటి ఖుష్బూ స్పందించారు. ‘‘భార్యభర్తల మధ్య ఏం జరిగింది అనేది, ఎందుకు విడిపోయారనేది వారిద్దరికీ తప్ప ఎవరికీ తెలీదు. వాళ్ల ప్రైవసీని అందరూ గౌరవించాలి. ఆ బాధ నుంచి వారు బయటకు రావడానికి కాస్త సమయం పడుతుంది. దయ చేసి ఈ విషయంపై రూమర్లు క్రియేట్‌ చేయవద్దు’’ అని ఖుష్బూ కోరారు. 



Updated Date - 2021-10-04T21:23:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!