గోవా ప్రకృతి: బికినీలో సమంత అల్లరి!
ABN , First Publish Date - 2021-12-28T00:23:05+05:30 IST
సమంత ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గోవాలో విహరిస్తున్నారు. తన స్నేహితులు శిల్పారెడ్డి, వాసుకి పుంజ్‌లతో కలిసి గోవా ట్రిప్ వేశారు. అక్కడ బీచ్, వాటర్స్‌ఫాల్స్, ఎస్టేట్స్‌లో సరదాగా తిరుగుతున్నారు. కార్యక్రమానికి తగ్గట్టు కాస్య్టూమ్స్ వేసుకునే ఆమె నీటిని చూస్తే బికినీలో దర్శనమిచ్చేస్తుంది.

సమంత ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గోవాలో విహరిస్తున్నారు. తన స్నేహితులు శిల్పారెడ్డి, వాసుకి పుంజ్‌లతో కలిసి గోవా ట్రిప్ వేశారు. అక్కడ బీచ్, వాటర్స్‌ఫాల్స్, ఎస్టేట్స్‌లో సరదాగా తిరుగుతున్నారు. కార్యక్రమానికి తగ్గట్టు కాస్య్టూమ్స్ వేసుకునే ఆమె నీటిని చూస్తే బికినీలో దర్శనమిచ్చేస్తుంది. తాజాగా గోవాలో బికినీ ధరించి స్నేహితులతో సెలయేళ్లలో ఎంజాయ్ చేస్తున్నారు. సమంత హడావిడి చూస్తుంటే న్యూ ఈయర్‌కు కూడా అక్కడే ఉండి సెలబ్రేట్ చేసుకుంటారని తెలుస్తోంది.
2021 సమంతకు ఎంతో బాధను మిగిల్చిన సంవత్సరంగా ఆమె చెప్పుకొచ్చారు. తను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో ఆమె విడాకులు తీసుకోవడంతో ఈ ఏడాది ఆమెకు కలిసిరాలేదని గతంలో చెప్పుకొచ్చారు సామ్. అయితే ఆ బాధను దిగమింగుకొని కెరీర్‌పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
