రెండు థియేటర్లలో విడుదలైన అగ్రహీరో సినిమా... గంతులేస్తున్న అభిమానులు
ABN , First Publish Date - 2021-06-13T13:30:38+05:30 IST
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమా థియేటర్లలో విడుదలైంది.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమా థియేటర్లలో విడుదలైంది. కరోనా సెకెండ్ వేవ్ దృష్ట్యా ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫారంలోనే విడుదల చేశారు. యువర్ మోస్ట్ వాంటెడ్ బ్రదర్ ట్యాగ్ లైన్‌తో వచ్చిన రాధే సినిమా ఈద్ సందర్భంగా మే 13న విడుదలయ్యింది. కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న ప్రస్తుత తరుణంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యింది. మహారాష్ట్రలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన నేపధ్యంలో కరోనా కేసులు అత్యల్పంగా ఉన్న ప్రదేశాలలోని థియేటర్లు తెరవడానికి ప్రభుత్వం అనుమతించింది. దీంతో మహారాష్ట్రలోని రెండు సినిమా థియేటర్లలో రాధే సినిమా విడుదలైంది. మాలేగావ్‌లోని రెండు థియేటర్లలో ఈ సినిమాను రాత్రి 7:30, 9:30 గంటలకు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల జీ స్టూడియో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. డ్రైవ్ ఇన్ సినిమాను ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకుల ఫొటోను షేర్ చేసింది....మీ మోస్ట్ వాంటెడ్ బ్రదర్ మిమ్మల్ని మాలేగావ్‌లో కలవడానికి వేచి చూస్తున్నాడు. అని కామెంట్ రాసింది.