‘శాకినీ-ఢాకినీ’ నిజమేనా?

ABN , First Publish Date - 2021-05-04T21:47:32+05:30 IST

కొరియన్‌ చిత్రం ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి. సురేశ్‌బాబు. సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

‘శాకినీ-ఢాకినీ’ నిజమేనా?

కొరియన్‌ చిత్రం ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి. సురేశ్‌బాబు. సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ‘శాకినీ-ఢాకినీ’ టైటిల్‌ ఖరారు చేశారనే వార్త ఫిల్మ్‌నగర్‌ సర్కిల్‌లో చక్కర్లు కొడుతుంది. అయితే నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికల పాత్రలు వైవిధ్యంగా ఉంటాయని సమాచారం. కరోనా మహమ్మారి సాధారణ పరిస్థితికి వచ్చాక ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుదల చేస్తారని తెలిసింది. 


Updated Date - 2021-05-04T21:47:32+05:30 IST