ఓటీటీలోకి సైనా బయోపిక్
ABN , First Publish Date - 2021-01-28T10:43:52+05:30 IST
బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవిత కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘సైనా’. పరిణీతి చోప్రా టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే...

బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవిత కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘సైనా’. పరిణీతి చోప్రా టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదలవుతుందని బాలీవుడ్ సమాచారం. గతేడాది వేసవిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నా లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయింది. ఇప్పటికీ థియేటర్లలో 50 శాతం ఆక్యుఫెన్సీతో నడుస్తుండడంతో ఓటీటీకి వెళ్లడం మంచిదని నిర్మాతలు భావించారట. త్వరలోనే ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట.