Sai-Manjrekar: రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ అవుతుందా..?
ABN , First Publish Date - 2021-12-25T15:11:32+05:30 IST
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ పాపులర్ నటుడు, దర్శక.. నిర్మాత.. రచయిత అయిన మహేశ్ మంజ్రేకర్ కూతురుగా
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ పాపులర్ నటుడు, దర్శక.. నిర్మాత.. రచయిత అయిన మహేశ్ మంజ్రేకర్ కూతురుగా బాలీవుడ్‌లో సూపర్ హిట్ సిరీస్ 'దబాంగ్' ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతోంది.
'మేజర్'..
అడివి శేష్ హీరోగా జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని 'గూఢచారి' ఫేం శశికిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారానే సయీ మంజ్రేకర్ టాలీవుడ్ ఎంట్రీ మొదలైంది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అమరవీరుడైన ఎన్.ఎస్.జి కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం స్ఫూర్తితో రూపొందుతుండగా.. తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. శోభిత ధుళిపాళ్ళ కీలక పాత్రను పోషిస్తోంది.
'గని'..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ఈ చిత్రంలోనూ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో మంచి గ్లామర్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. కిరణ్ కుమార్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. వాస్తవంగా ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ పోస్ట్‌పోన్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని రినైసాన్స్ పిక్చర్స్- అల్లు బాబి కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్దా- అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు గనక హిట్ అయితే ఖచ్చితంగా వరుస అవకాశాలు చేజిక్కించుకుంటుంది. అది ఈ సినిమాల సక్సెస్ మీద ఆధారపడి ఉంది. చూడాలి అమ్మడికి 'మేజర్', 'గని' చిత్రాలు ఎలాంటి క్రేజ్ తీసుకువస్తాయో.
