‘పుష్ప- ది రైజ్’: మూడో సింగిల్ ప్రోమో వదిలారు
ABN , First Publish Date - 2021-10-25T23:11:37+05:30 IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అందులో మొదటి భాగమైన ‘పుష్ప: ది రైజ్’ క్రిస్మస్ కానుకగా..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అందులో మొదటి భాగమైన ‘పుష్ప: ది రైజ్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుండి ‘సామి సామి’ అనే సాంగ్ ప్రోమోని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇప్పటి వరకు విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’ లిరికల్ వీడియోలు ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. 3వ సింగిల్‌గా విడుదల కాబోతోన్న ఈ ‘సామి సామి’ సాంగ్ ప్రోమో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పాటను ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రచింపగా.. మౌనిక యాదవ్ ఆలపించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరకల్పన చేశారు. పూర్తి పాటను అక్టోబర్ 28, ఉదయం 11గంటల 07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. కాగా, ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తోంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.