ప్రతి ఐదు రోజులకూ ఆర్‌టి-పీసీఆర్ టెస్టులు!
ABN , First Publish Date - 2021-06-20T06:00:56+05:30 IST
‘‘చిత్రీకరణ ప్రారంభించడానికి ఇరవై నాలుగు గంటల ముందే చిత్రబృందంలో అందరికీ ఆర్‌టి-పీసీఆర్ టెస్టులు చేయిస్తున్నాం. మళ్లీ, ప్రతి ఐదు రోజులకూ ఆ టెస్ట్‌లు రిపీట్ చేస్తున్నాం....
‘‘చిత్రీకరణ ప్రారంభించడానికి ఇరవై నాలుగు గంటల ముందే చిత్రబృందంలో అందరికీ ఆర్‌టి-పీసీఆర్ టెస్టులు చేయిస్తున్నాం. మళ్లీ, ప్రతి ఐదు రోజులకూ ఆ టెస్ట్‌లు రిపీట్ చేస్తున్నాం. సెట్‌లో ఎప్పుడూ ఓ డాక్టర్ ఉంటున్నారు. నటీనటులు మినహా మిగతా బృందమంతా మెడికల్ మాస్క్‌లు, ఫేస్ షీల్డులు ధరించడం తప్పనిసరి చేశాం. సెట్ అంతా తరచూ శానిటైజేషన్ చేస్తున్నాం’’ అని అక్షయ్‌కుమార్ వివరించారు. ఇటీవల ముంబైలో ‘రక్షాబంధన్’ చిత్రీకరణ మొదలైన సంగతి తెలిసిందే. జాగ్రత్తలు తీసుకుంటూ పని చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ‘సూర్యవంశీ’, ‘బెల్ బాటమ్’, ‘అతరంగి రే’, ‘పృథ్వీరాజ్’, ‘రామ్ సేతు’, ‘బచ్చన్ పాండే’, ‘రక్షాబంధన్’, ‘ఓ మై గాడ్-2’ - ఇప్పుడు అక్షయ్ చేతిలో ఉన్న చిత్రాల జాబితా పెద్దదే. అందులో కొన్ని ఏడాది నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. వీటి గురించి అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ ‘‘నా సినిమాలన్నీ వెండితెరపై విడుదల కావాలని కోరుకుంటాను. కానీ, పరిస్థితులను బట్టి కొన్ని ఓటీటీలో విడుదలయ్యాయి. ‘సూర్యవంశీ’ కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నారంతా. గతేడాది కరోనా వల్ల వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేద్దామనుకుంటే కుదరలేదు. మూడోసారి అదృష్టం కలిసి వస్తుందని ఆశిస్తున్నా’’ అని చెప్పారు.
ధూమ్-4... వదంతే!
‘ధూమ్-4’లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించనున్నారని బీటౌన్‌లో ఓ వార్త చక్కర్లు కొట్టింది. ‘‘ప్రస్తుతానికి ‘ధూమ్-4’ గురించి వినిపిస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే. నేను రెండు మాటలు చెప్పగలను... అది ఫేక్ న్యూస్. వదంతే!’’ అని అక్షయ్‌కుమార్ పేర్కొన్నారు.