రూ. 3 కోట్ల సెట్ వర్షార్పణం
ABN , First Publish Date - 2021-06-04T06:52:57+05:30 IST
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి. వినాయక్ దర్శకత్వంలో ‘ఛత్రపతి’ని డా. జయంతిలాల్ గడ హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే....

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి. వినాయక్ దర్శకత్వంలో ‘ఛత్రపతి’ని డా. జయంతిలాల్ గడ హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కళాదర్శకుడు సునీల్‌బాబు నేతృత్వంలో హైదరాబాద్‌లో ఓ సెట్ వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ సెట్ తీవ్రంగా దెబ్బతిన్నదని నిర్మాత తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఆరు ఎకరాల్లో రూ. మూడు కోట్ల వ్యయంతో విలేజ్ సెట్ వేశాం. ఏప్రిల్ 22న చిత్రీకరణ ప్రారంభించాలనుకున్నాం. కానీ, కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ వల్ల కుదరలేదు. వర్షాలకు తీవ్రంగా సెట్ దెబ్బతినడంతో పునరుద్దరించే పనుల్లో సునీల్‌బాబు బృందం ఉంది. పరిస్థితులు చక్కబడ్డాక, సెట్ పనులు కొలిక్కి వచ్చాక చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు. టైటిల్, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.