RRR: బాలీవుడ్‌లో మొదటిరోజు వసూళ్ళ టార్గెట్ ఎంతంటే..?

ABN , First Publish Date - 2021-12-29T14:01:18+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది జనవరి 7 కోసం. ఆరోజు రాజామౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్' అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

RRR: బాలీవుడ్‌లో మొదటిరోజు వసూళ్ళ టార్గెట్ ఎంతంటే..?

ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది జనవరి 7 కోసం. ఆరోజు రాజామౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్' అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ఫిక్షనల్ వార్ డ్రామాగా తెరకెక్కగా..ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురమ్ భీమ్ పాత్రలో..రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగన్ సహా పలువురు సౌత్ అండ్ హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే, ఈ సినిమా విడుదల తొలిరోజు బాలీవుడ్‌లో వసూళ్ళపరంగా పెట్టుకున్న టార్గెట్ రూ.30 కోట్లని తెలుస్తోంది. 


ఖచ్చితంగా 'ఆర్ఆర్ఆర్' రిలీజైన మొదటిరోజు ప్రపంచవ్యాంగా అన్నీ చోట్ల నుంచి మ్యాజిక్ ఫిగర్స్ కనిపించడం ఖాయం. ఇందులో భాగంగా ఒక్క హిందీ బెల్ట్‌లో రూ. 30 కోట్ల వరకు ఓపెనింగ్స్‌ను రాబట్టే అవకాశం వుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ, ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ సినిమాలు వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హిందీ 'జెర్సీ' రిలీజ్ ఆగిపోయింది. దాంతో ఇప్పుడు అక్కడ 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' సినిమాల రిలీజ్ పరిస్థితేంటి అనేది డైలమాగా మారింది.

Updated Date - 2021-12-29T14:01:18+05:30 IST