'ఆర్ఆర్ఆర్' : అమెరికాలో రిలీజ్ చేసేది వీరే..!
ABN , First Publish Date - 2021-04-08T15:38:43+05:30 IST
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'రౌద్రం రణం రుధిరం' (ఆర్ఆర్ఆర్). ఈ భారీ మల్టీస్టారర్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శక్తివంతమైన పోరాట యోధులుగా నటిస్తున్నారు. ఆలియా భట్, అజయ్ దేవగన్, ఓవిలియా మోరీస్, శ్రియ శరణ్ సహా పలువురు

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'రౌద్రం రణం రుధిరం' (ఆర్ఆర్ఆర్). ఈ భారీ మల్టీస్టారర్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శక్తివంతమైన పోరాట యోధులుగా నటిస్తున్నారు. ఆలియా భట్, అజయ్ దేవగన్, ఓవిలియా మోరీస్, శ్రియ శరణ్ సహా పలువురు బాలీవుడ్..హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న అన్నీ ప్రధాన భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ఉత్తరాది రాష్ట్రాల్లో పంపిణీ హక్కులను పెన్ స్టూడియోస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' కి సంబంధించిన అన్ని భాషల డిజిటల్, శాటిలైట్ హక్కులను పొందగా.. తమిళ థియేట్రికల్ రైట్స్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దక్కించుకున్నారు.
కాగా తాజాగా ఈ సినిమాని అమెరికాలో 'సరిగమ సినిమాస్', రఫ్తార్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేయబోతున్నారు. అఫీషియల్‌గా ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. 'ఆర్ఆర్ఆర్' ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా దసరా పండుగని పురస్కరించుకొని అక్టోబర్ 13న విడుదల అవుతుండగా అమెరికాలో మాత్రం ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ 12నే ప్రీమియర్ షో వేయనున్నట్లు కూడా ఈ రెండు సంస్థలు వెల్లడించాయి. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత దర్శక ధీరుడు నుచి రాబోతున్న మీద తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.