‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు కొత్త పేరు!

ABN , First Publish Date - 2021-12-29T01:59:44+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు కొత్త అర్థం చెప్పారు బాలీవుడ్‌ వ్యాఖ్యాత కపిల్‌శర్మ. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ది కపిల్‌ శర్మ షో’కి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నుంచి రాజమౌళి, రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, ఆలియాభట్‌ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కపిల్‌ టీమ్‌ను నాన్‌స్టాప్‌గా నవ్వించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే ‘రూపాయి రూపాయి రూపాయి’ అని రాజమౌళిని చమత్కరించారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు కొత్త పేరు!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు కొత్త అర్థం చెప్పారు బాలీవుడ్‌ వ్యాఖ్యాత కపిల్‌శర్మ. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న   ‘ది కపిల్‌ శర్మ షో’కి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నుంచి రాజమౌళి, రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, ఆలియాభట్‌ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కపిల్‌ టీమ్‌ను నాన్‌స్టాప్‌గా నవ్వించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే ‘రూపాయి రూపాయి రూపాయి’ అని రాజమౌళిని చమత్కరించారు. ‘‘మీకు ఎయిర్‌లైన్స్‌, హాస్పిటల్స్‌, హోటల్స్‌ ఇతర వ్యాపారాలుండగా ఎందుకు సినిమాల్లో నటిస్తున్నారు’ అంటూ కపిల్‌ ప్రశ్నించగా ‘ఎయిర్‌లైన్స్‌ కంపెనీ ఉన్నా ఈ షోకి వచ్చే అవకాశం ఉండదు కదా’ అని రామ్‌ చరణ్‌ సమాధానమిచ్చారు. ఇలా కపిల్‌ శర్మ అడిగిన ప్రతి ప్రశ్న నవ్వులు పూయించింది. ‘రాజమౌళి సర్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే రూపాయి, రూపాయి, రూపాయి కదా’ అని చమత్కరించారు.


ఆలియాభట్‌పై కూడా సెటైర్లు వేశారు. ‘ఆలియా నువ్వు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చేయడానికి ముందు కకథ విన్నావా లేక ‘ఆర్‌’ (రణ్‌బీర్‌ కపూర్‌) అక్షరం ఉందని యాక్ట్‌ చేశావా? అని ప్రశ్నించగా ఆలియా సిగ్గు పడుతూ నవ్వుకుంది. 


ఎన్టీఆర్‌ సర్‌ మొదటిసారి మీరు, రామ్‌చరణ్‌ కలిసి ఈ సినిమా చేశారు. ఇంతకు ముందు ఇలాంటి ఆఫర్‌ రాలేదా లేక ఇంత బడ్జెట్‌ పెట్టే నిర్మాత దొరకలేదా? అని అడిగారు. ఇంత బడ్జెట్‌ పెట్టే నిర్మాత అప్పట్లో దొరకలేదని సమాధానమిచ్చారు. 


రామ్‌చరణ్‌ సర్‌.. మీ నాన్న చిరంజీవిగారు, బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ స్టార్‌ హీరోలు. ఇంకా మీ ఇంట్లో పెద్ద హీరోలు ఉన్నారు.  మీరంతా కలిసి భోజనం చేస్తున్నప్పుడు వాచ్‌మెన్‌ వచ్చి ఫ్యాన్‌ వచ్చారు అని చెబితే ‘ఎవరి ఫ్యాన్‌’ అని కన్‌ఫ్యూజ్‌ అవుతారా? 


రామ్‌చరణ్‌: తప్పకుండా అవుతాను. ఫ్యాన్‌ విషయంలోనే కాదు. ఒక దర్శకుడు వస్తే ఎవరి కోసం కథ తెచ్చారో అనే కన్‌ఫ్యూజన్‌ ఎక్కువ. ఇలా ఆసక్తికరంగా కపిల్‌ శర్మ షో సాగింది. 


Updated Date - 2021-12-29T01:59:44+05:30 IST