సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'RRR': ఆలియా మేకింగ్ వీడియోతో సర్‌ప్రైజ్..

ABN, First Publish Date - 2021-12-08T18:16:04+05:30

తాజాగా 'ఆర్ఆర్ఆర్' మూవీ ఆలియా భట్ మేకింగ్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాజాగా 'ఆర్ఆర్ఆర్' మూవీ ఆలియా భట్ మేకింగ్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని పాన్న్ ఇండియన్ రేంజ్‌లో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్, శ్రీయ శరణ్, ఓలివియా మోరీస్, సముద్రఖని వంటి వారితో పాటు మిగతా సౌత్ భాషలలోని అగ్ర నటులు..హాలీవుడ్ ప్రముఖ నటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య 450 భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 7న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు ( డిసెంబర్ 9) థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే, అంతకంటే ముందే ఇందులో సీత పాత్రలో నటించిన ఆలియా భట్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను రాజమౌళి బృందం రిలీజ్ చేసింది. ఈ మేకింగ్ వీడిలో ఆమె ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి సీత పాత్ర కోసం మేకోవర్ అవడం..షూటింగ్‌లో పాల్గొనడం వరకు విజువల్స్‌తో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్‌కు ఒక్కరోజు ముందు ఇలా ఆలియ భట్ వీడియోను రిలీజ్ చేసి మరింతగా అంచనాలు పెంచారు 'ఆర్ఆర్ఆర్' టీమ్. 



Updated Date - 2021-12-08T18:16:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!