చరణ్‌ బర్త్‌డేకి ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌ ఇచ్చే ట్రీట్ ఇదే

ABN , First Publish Date - 2021-03-20T23:03:50+05:30 IST

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ

చరణ్‌ బర్త్‌డేకి ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌ ఇచ్చే ట్రీట్ ఇదే

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)'. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఎదురుచూస్తున్న ఆర్ఆర్‌ఆర్‌ సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయనున్నట్లుగా చిత్రయూనిట్‌ అల్రెడీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా అప్‌డేట్‌ని చిత్రయూనిట్‌ అధికారికంగా తెలియజేసింది. 


మార్చి 27 మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా మెగాభిమానులకు చిత్రయూనిట్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించింది. చరణ్‌ బర్త్‌డే కానుకగా ఓ ఫైర్‌కేస్ట్‌ పోస్టర్‌ని విడుదల చేయబోతున్నామని తెలుపుతూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ అఫీషియల్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. 'రామరాజు వస్తున్నాడు..' అని తెలుపుతూ వచ్చిన ఈ అప్‌డేట్‌తో మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ.. చిత్రయూనిట్‌కు థ్యాంక్స్‌ చెబుతున్నారు. మ‌న్యంవీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని, హాలీవుడ్ స్టార్ అలిస‌న్ డూడీ స‌హా ప్ర‌ముఖ తారాగ‌ణమంతా న‌టిస్తున్నారు. ఫిక్ష‌న‌ల్‌ పీరియాడిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.

Updated Date - 2021-03-20T23:03:50+05:30 IST