సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆర్‌ఆర్‌ఆర్‌ ఆడియో రైట్స్‌ వారివే!

ABN, First Publish Date - 2021-07-27T01:21:37+05:30

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కీలక పాత్రధారులుగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఆడియో రైట్స్‌ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో టీ–సిరీస్‌, లహరి మ్యూజిక్‌ సంస్థలు దక్కించుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కీలక పాత్రధారులుగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా  ఆడియో రైట్స్‌ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో టీ–సిరీస్‌, లహరి మ్యూజిక్‌ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. భూషణ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌ అంటే మాకెంతో ఇష్టం. వారి పనిని మేం ఎప్పుడూ గౌరవిస్తాం. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఆడియో రైట్స్‌ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. పాటలు, సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అని అన్నారు. అజయ్‌ దేవగణ్‌, శ్రియ, ఆలియాభట్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 13న సినిమా విడుదల కానుంది. 


Updated Date - 2021-07-27T01:21:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!