‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ వచ్చే తేదీ ఖరారు
ABN , First Publish Date - 2021-11-29T21:59:00+05:30 IST
టాలీవుడ్ పవరేంటో మరోసారి ప్రపంచానికి చాటేలా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ పాన్ ఇండియన్ మూవీ 7 జనవరి, 2022న విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి

టాలీవుడ్ పవరేంటో మరోసారి ప్రపంచానికి చాటేలా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ పాన్ ఇండియన్ మూవీ 7 జనవరి, 2022న విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, పాటలు.. సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చగా.. ట్రైలర్ ఎప్పుడెప్పుడు వదులుతారా? అని ప్రేక్షకలోకం అంతా ఎదురుచూస్తోంది. వారి ఎదురుచూపులను గమనించిన రాజమౌళి.. దీనికోసం ఎక్కువ టైమ్ తీసుకోకుండానే విడుదల తేదీని ప్రకటించారు. చిత్ర ట్రైలర్‌ను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా.. రాజమౌళితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.