అద్భుత విజువల్స్ తో అదరగొడుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ గ్లింప్స్

ABN , First Publish Date - 2021-11-01T16:50:05+05:30 IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ.. 1920 నాటి కథతో పీరియాడికల్ నేపథ్యంలో రూపొందిన ఫిక్షన్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా యన్టీఆర్ నటిస్తుండగా.. వీరిద్దరికీ మెంటార్ లాంటి పాత్రను బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ పోషిస్తున్నారు. చెర్రీ సరసన కథానాయికగా ఆలియా భట్, యన్టీఆర్ సరసన కథానాయికగా ఓ బ్రిటీష్ బ్యూటీ నటిస్తున్నారు.

అద్భుత విజువల్స్ తో అదరగొడుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ గ్లింప్స్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ.. 1920 నాటి కథతో పీరియాడికల్ నేపథ్యంలో రూపొందిన ఫిక్షన్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా యన్టీఆర్ నటిస్తుండగా.. వీరిద్దరికీ మెంటార్ లాంటి పాత్రను బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ పోషిస్తున్నారు. చెర్రీ సరసన కథానాయికగా ఆలియా భట్, యన్టీఆర్ సరసన కథానాయికగా ఓ బ్రిటీష్ బ్యూటీ నటిస్తున్నారు. ఇంతకు ముందు తారక్, చెర్రీ పాత్రలకు సంబంధించిన టీజర్స్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ రాగా.. ‘దోస్తీ’ అనే సింగిల్ కు కూడా అద్భుతమైన స్పందన లభించింది. ఇక ఈ రోజు ఆర్.ఆర్.ఆర్ సినిమాకు సంబందించి ఓ స్పెషల్ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. 



45 సెకండ్స్ నిడివితో కట్ చేసిన ఈ గ్లింప్స్ వీడియో.. అద్భుతమైన విజువల్స్ తో కట్టిపడేస్తోంది. ఈ ఉదయం11 గంటలకు విడుదలైన వీడియోకి అప్పుడే రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కీరవాణి సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో జక్కన్న అసాధారణ విజువల్స్ తో గ్లిమ్స్ .. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యన్టీఆర్, రామ్ చరణ్ పాత్రల్లోని ఇంటెన్సిటీని అద్బుతంగా చూపిస్తూ.. వార్ ఎపిసోడ్స్ తో ఒక బ్లాస్ట్ గా ఈ టీజర్ ను వదిలారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. జనవరి 7న పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో విడుదల కానున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ఎన్ని రికార్డుల్ని తిరగరాస్తుందో చూడాలి. 



Updated Date - 2021-11-01T16:50:05+05:30 IST