ఆర్‌ఆర్‌ఆర్‌ గ్లింప్స్‌: స్టార్‌ హీరోల స్పందన!

ABN , First Publish Date - 2021-11-01T23:58:11+05:30 IST

రాజమౌళి ఏం చేసినా అదొక సంచలనమే! తన సినిమాను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో, ప్రేక్షకుల్లో ఆసక్తిని ఎలా రేకెత్తించాలో తెలిసిన టెక్నీషిన్‌. ఆయన టీమ్‌ కూడా అంతే విజన్‌తో ఉంటుంది. సోమవారం విడుదల చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ‘గ్లింప్స్‌’ అంతే ఆసక్తికరంగా ఉంది. తారక్‌–రామ్‌చరణ్‌తోపాటు చిత్రంలో కీలక పాత్రలను 45 సెకన్ల వీడియోలో చక్కగా చూపించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ గ్లింప్స్‌: స్టార్‌ హీరోల స్పందన!

రాజమౌళి ఏం చేసినా అదొక సంచలనమే! తన సినిమాను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో, ప్రేక్షకుల్లో ఆసక్తిని ఎలా రేకెత్తించాలో తెలిసిన టెక్నీషిన్‌. ఆయన టీమ్‌ కూడా అంతే విజన్‌తో ఉంటుంది. సోమవారం విడుదల చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ‘గ్లింప్స్‌’ అంతే ఆసక్తికరంగా ఉంది. తారక్‌–రామ్‌చరణ్‌తోపాటు చిత్రంలో కీలక పాత్రలను 45 సెకన్ల వీడియోలో చక్కగా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఓ పక్క అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తుంటే సినీ సెలబ్రిటీల నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. మహేశ్‌బాబు,  అల్లు అర్జున్‌, నాని, రానా ట్విట్టర్‌ వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

‘‘స్పెక్టాక్యూలర్‌ విజువల్స్‌. స్టన్నింగ్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూడడం కోసం వేచి చూస్తున్నా’’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

‘‘మైండ్‌ బ్లోయింగ్‌ టీజర్‌. భారతీయ చిత్రపరిశ్రమకు రాజమౌళి ఓ గర్వకారణం. నా బ్రదర్‌ చరణ్‌.. నా బావ తారక్‌.. పవర్‌ప్యాక్డ్‌ ప్రదర్శనతో అదరగొట్టారు. అజయ్‌, ఆలియా, శ్రియతోలతోపాటు చిత్రబృందం మొత్తానికి నా హృదయ పూర్వక అభినందనలు’’ అని బన్నీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

‘‘రాజమౌళి సార్‌.. 45 సెకన్ల వీడియోలో సినిమాలో కీలక పాత్రలన్నింటినీ ఇంత వైవిధ్యంగా ఎలా చూపించగలిగారు’’ అని నాని కామెంట్‌ చేశారు.

‘‘మెగా మాస్‌ మ్యాజిక్‌. లైఫ్‌లో ఇలాంటి అవుట్‌స్టాండింగ్‌ థింగ్స్‌ను చూడలేము’’ అని రానా దగ్గుబాటి ట్వీట్‌ చేశారు.

డి.వి.వి దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, తారక్‌.. కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. చరణ్‌కు జోడీగా అలియాభట్‌, తారక్‌కు జంటగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ కనిపించనున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలక పాత్రధారులు. 
Updated Date - 2021-11-01T23:58:11+05:30 IST