రాయ్‌ లక్ష్మీ నిశ్చితార్థం..!

ABN , First Publish Date - 2021-04-08T16:19:52+05:30 IST

లక్ష్మీ రాయ్‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ముందు తమిళంలో బాగా పాపులర్ అయి ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోనూ పేరు తెచ్చుకుంది. కన్నడలో చేసిన షార్ట్ ఫిల్మ్ చూసిన దర్శకుడు తమిళ సినిమాలో అవకాశం కల్పించాడు. ఆ సినిమా హిట్ అవడంతో వరసగా తమిళంలో తెరకెక్కిన కామెడి, యాక్షన్,

రాయ్‌ లక్ష్మీ నిశ్చితార్థం..!

లక్ష్మీ రాయ్‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ముందు తమిళంలో బాగా పాపులర్ అయి ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోనూ పేరు తెచ్చుకుంది. కన్నడలో చేసిన షార్ట్ ఫిల్మ్ చూసిన దర్శకుడు తమిళ సినిమాలో అవకాశం కల్పించాడు. ఆ సినిమా హిట్ అవడంతో వరసగా తమిళంలో తెరకెక్కిన కామెడి, యాక్షన్, రొమాంటిక్ జోనర్స్‌ సినిమాలలో నటించే అవకాశం అందుకుంది లక్ష్మీ రాయ్. అయితే తెలుగులో మాత్రం స్పెషల్ సాంగ్స్‌తో బాగా పాపులర్ అయింది. నందమూరి బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాలో హీరోయిన్‌గా నటించినప్పటికీ ఆ సినిమా పెద్ద సక్సస్‌ని ఇవ్వలేకపోయింది. కానీ స్పెషల్ సాంగ్స్‌తో మాత్రం బాగా క్రేజ్ తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్‌సింగ్, మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైది నంబర్ 150 సినిమాలలో స్టెప్పులేసింది. అంతక ముందే మాస్ మహారాజ రవితేజ నటించిన బలుపు సినిమాలో కూడా గెస్ట్ అపీరియన్స్ ఇచ్చింది.


కాగా బాలీవుడ్‌లో నటించిన జూలీ 2 సమయంలో రాయ్ లక్ష్మీ అని పేరు కూడా మార్చుకుంది. అయితే బాలీవుడ్‌లో రాయ్ లక్ష్మీకి పెద్దగా కలిసి రాలేదు. ఇక ప్రస్తుతం రాయ్ లక్ష్మీ చేతిలో రెండు తమిళ సినిమాలు ఒక తెలుగు సినిమా, ఒక కన్నడ, ఒక మలయాళ సినిమా ఉన్నాయి. తెలుగులో కాకపోయినా తమిళంలో మాత్రం బాగానే సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే త్వరలో రాయ్ లక్ష్మీ ఎంగేజ్‌మెంట్‌ తేదీ ఫిక్సయిందని వెల్లడించింది. ఈ నెల 27న నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణాయించారని..అయితే నా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలను బయటపెట్టాలనుకోవడం లేదు.. అంటూ చెప్పుకొచ్చింది రాయ్‌ లక్ష్మి.  

Updated Date - 2021-04-08T16:19:52+05:30 IST