వైరల్‌ అవుతోన్న ల‌డిల‌డి సాంగ్.. మెగాస్టారే స్పూర్తి అంటోన్న హీరో

ABN , First Publish Date - 2021-01-18T22:52:09+05:30 IST

నో ఐడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ ప‌తాకంపై యంగ్ హీరో రోహిత్ నంద‌న్, ఇంటర్నెట్ సెన్సేష‌న్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ జంట‌గా రూపొందిన ల‌డిల‌డి

వైరల్‌ అవుతోన్న ల‌డిల‌డి సాంగ్.. మెగాస్టారే స్పూర్తి అంటోన్న హీరో

నో ఐడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ ప‌తాకంపై యంగ్ హీరో రోహిత్ నంద‌న్, ఇంటర్నెట్ సెన్సేష‌న్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ జంట‌గా రూపొందిన ల‌డిల‌డి అనే పాట రీసెంట్‌గా విడుద‌లై.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మాసీ నెంబ‌ర్‌ని సంగీత ద‌ర్శ‌కుడు శ్రీచ‌ర‌ణ్ పాకాల కంపోజ్ చేయగా..  బిగ్ బాస్ 3 విన్న‌ర్, హ్యాపేనింగ్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌తో పాటు ఇత‌ర సంగీత మాధ్య‌మాలలోనూ శ్రోత‌ల్ని అలరిస్తుండటంతో చిత్రయూనిట్‌ సంతోషాన్ని వ్యక్తం చేసింది. 


ఈ సంద‌ర్భంగా హీరో రోహిత్ నంద‌న్ మాట్లాడుతూ.. తాను మెగాస్టార్ చిరంజీవిగారిని ఆద‌ర్శంగా తీసుకుని డ్యాన్స్, న‌ట‌న త‌దిత‌ర సినిమా విభాగాల్లో శిక్ష‌ణ తీసుకున్న‌ట్లుగా తెలిపారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌న స్నేహితుడు శ్రీచ‌ర‌ణ్ పాకాల‌తో క‌లిసి ఈ ల‌డిల‌డి అనే పాటకు సంబంధించిన కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేసి ఆ త‌రువాత ఆయ‌న సూచ‌న‌లు ద్వారా ఈ ఆల్బ‌మ్ లోకి ఇంట‌ర్నెట్ సెన్సేష‌న్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ను, ప్ర‌ముఖ సింగ‌ర్ రాహుల్ సిప్లీగంజ్‌ని తీసుకున్నామ‌ని అన్నారు. ఈ పాట‌ను ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ర‌ఘు మాస్ట‌ర్ త‌న డాన్సింగ్ స్కిల్స్ తో, లిరిక్‌ రైట‌ర్ విస్సాప్ర‌గ‌డ త‌న రైటింగ్ తో మ‌రో లెవెల్ కి తీసుకెళ్లార‌ని, ఈ పాట ద్వారానే ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ తెలుగు చిత్రీ సీమ‌లోకి అడుగుపెట్టార‌ని, ఆమె ఈ పాట‌లో ఆడ‌ట‌మే కాదు పాడ‌టం కూడా జ‌రిగింద‌ని తెలిపారు. తొలిసారిగా తాను చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆద‌రించ‌డం, యూట్యూబ్‌లో ఈ పాట‌కు 2 మిలియ‌న్ పైగా వ్యూస్ రావ‌డం తన‌కు చాలా ఆనందాన్ని ఇచ్చింద‌ని తెలుపుతూ.. తాను త్వ‌ర‌లోనే హీరోగా ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడితో తెలుగు చిత్ర సీమ‌లోకి ఎంట్రీ ఇస్తున్నానని, దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రాబోతుందని చెప్పుకొచ్చారు.Updated Date - 2021-01-18T22:52:09+05:30 IST