రాక్ స్టార్ ఈజ్ బ్యాక్..!
ABN , First Publish Date - 2021-04-08T15:02:05+05:30 IST
టాలీవుడ్‌లో రాక్ స్టార్‌గా దేవీశ్రీప్రసాద్ ఇచ్చే మ్యూజిక్‌కి ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. డీఎస్‌పీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంటే బ్లైండ్‌గా ఆల్బం సూపర్ హిట్ అని చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులు..ప్రేక్షకులు ఫిక్సైపోతారు. అంతగా దేవీశ్రీప్రసాద్ తన పాటల ప్రభావం చూపించాడు.

టాలీవుడ్‌లో రాక్ స్టార్‌గా దేవీశ్రీప్రసాద్ ఇచ్చే మ్యూజిక్‌కి ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. డీఎస్‌పీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంటే బ్లైండ్‌గా ఆల్బం సూపర్ హిట్ అని చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులు..ప్రేక్షకులు ఫిక్సైపోతారు. అంతగా దేవీశ్రీప్రసాద్ తన పాటల ప్రభావం చూపించాడు. హీరో ఎవరైనా దేవీశ్రీ ట్యూన్ అంటే ఒంట్లోనీ నర నరం నాట్యం చేయాల్సిందే. అంత ఊపుండే పాటలివ్వడంలో తనకి తానే సాటి అని ఎన్నో సినిమాల విషయంలో నిరూపించాడు. యంగ్ హీరో సినిమా, స్టార్ హీరో సినిమా అయినా దేవీశ్రీ వర్కింగ్ స్టైల్ ఒకటే .. టార్గెట్ ఒకటే. మ్యూజిక్ పరంగా రిలీజ్‌కి ముందే సినిమా సూపర్ హిట్ అని టాక్ రావాలి. దాదాపు టాలీవుడ్ హీరోలందరితోనూ దేవీశ్రీ పని చేశాడు. ఒక్క టాలీవుడ్‌లో మాత్రమే కాదు కోలీవుడ్‌లో కూడా దేవీశ్ర్రీ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకి సంగీతం అందించాడు.
అయితే గత రెండు మూడేళ్ళుగా దేవీశ్రీ జోరు తగ్గింది. థమన్ క్రేజ్ బాగా పెరగడంతో కాస్త దేవీశ్రీ డల్ అయ్యాడు. అయితే మళ్ళీ 'ఉప్పెన' సినిమాతో తన సత్తా చూపించిన దేవీశ్రీప్రసాద్ తాజాగా రిలీజయిన 'పుష్ప' టీజర్‌తో రాక్ స్టార్ ఈజ్ బ్యాక్ అనిపించాడు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా 'పుష్ప' సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌కి దేవీశ్రీప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని ప్రతీ ఒక్కరు చెప్పుకుంటున్నారు. నేపథ్యానికి తగ్గట్టు దేవీశ్రీ హై ఓల్టేజ్‌లో ఉండే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కి బాగా హైప్ తీసుకు వచ్చింది. ఖచ్చితంగా ఇండస్ట్రీ కొట్టబోతున్నారన్న టాక్ మొదలైంది. 'పుష్ప' సినిమా సక్సస్‌లో మళ్ళీ దేవీశ్రీ మేజర్ పార్ట్ కాబోతున్నాడని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో 5 భాషల్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక 'పుష్ప'.. సుకుమార్, అల్లు అర్జున్ దేవీశ్రీప్రసాద్‌ల హ్యాట్రిక్ సినిమా కావడం విశేషం.
