మళ్ళీ బాక్సింగ్ శిక్షణలో రితిక
ABN , First Publish Date - 2021-06-04T17:12:32+05:30 IST
కరోనా లాక్‌డౌన్ కారణంగా చేతిలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా లేదు. దీంతో రితిక తిరిగి తన బాక్సింగ్‌పైనే దృష్టికేంద్రీకరించింది. ఇందుకోసం ఆమె తన నివాసంలోనే ఓ ట్రైనర్ సమక్షంలో శిక్షణ పొందుతోంది.

గతంలో బాక్సింగ్ ఇతివృత్తంతో వచ్చిన ‘ఇరుదుసుట్రు’ అనే సినిమాతో కోలీవుడ్ వెండితెరకు పరిచయమైన బాక్సింగ్ క్రీడాకారిణి రితికా సింగ్. ఈ చిత్రం బాగా ప్రేక్షకాదరణ పొండటంతో తెలుగులో కూడా విక్టరీ వెంకటేష్ హీరోగా ‘గురు’ పేరుతో రీమేక్ అయ్యింది. అందులోనూ రితికా సింగ్ నటించింది. ఆ తర్వాత రితిక ‘ఆండవన్ కట్టళై’, ‘శివలింగా’, ‘ఓ మై కడవులే’ వంటి పలు చిత్రాల్లో నటించగా, మరో చిత్రం విడుదల కావాల్సి వుంది. ఈ బాక్సింగ్ క్రీడాకారిణికి తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావలేదు. పైగా, ఇపుడు కరోనా లాక్‌డౌన్ కారణంగా చేతిలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా లేదు. దీంతో రితిక తిరిగి తన బాక్సింగ్‌పైనే దృష్టికేంద్రీకరించింది. ఇందుకోసం ఆమె తన నివాసంలోనే ఓ ట్రైనర్ సమక్షంలో శిక్షణ పొందుతోంది.