ఫ్యామిలీ ట్రిప్‌లా షూటింగ్ కంప్లీట్ చేశామంటోంది
ABN , First Publish Date - 2021-02-02T03:18:57+05:30 IST
మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణలో, మణిదీప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై లుకాలపు మధు, సోమేశ్ ముచర్ల నిర్మాతలుగా దత్తి సురేష్ బాబు

మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణలో, మణిదీప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై లుకాలపు మధు, సోమేశ్ ముచర్ల నిర్మాతలుగా దత్తి సురేష్ బాబు నిర్మాణ నిర్వహణలో రూపొందుతున్న చిత్రం ''బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది''. రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో కుమార్ కోట దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షకలక శంకర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న రితిక చక్రవర్తి.. సినిమా విశేషాలను మీడియాకి తెలియజేశారు.
ఆమె మాట్లాడుతూ.. ''నేను ఈ చిత్రంలో సుజి పాత్రలో నటించాను. షకలక శంకర్ గారి వైఫ్ రోల్‌లో కనిపిస్తాను. డైరెక్టర్ కుమార్ కోటగారికి ఇది మొదటి సినిమా అయినా చాలా కష్టపడి పని చేశారు. షకలక శంకర్, దర్శకనిర్మాతల సహకారం మరచిపోలేను. మేమందరం ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్లి వచ్చినట్లు సినిమాను పూర్తి చేయగలిగాం. మేమంతా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాము.
ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్‌టైనర్ బొమ్మ అదిరింది దిమ్మతిరిగింది సినిమాలో చిన్న హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్ వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు. నేను నటించిన మొదటి సినిమా అయినా సెట్స్‌లో అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. తెలుగులో నేను ఒక మంచి సినిమాతో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా చేస్తున్నపుడు కొన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి. త్వరలో వాటి వివరాలు తెలుపుతాను.." అని అన్నారు.