సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మహేష్ వదిలిన 'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్

ABN, First Publish Date - 2021-08-19T17:43:15+05:30

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్ర ట్రైలర్‌ను వదిలారు. ఆయన బావమరిది, యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్ర ట్రైలర్‌ను వదిలారు. ఆయన బావమరిది, యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. ఆనంది హీరోయిన్‌గా నటించింది. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మహేష్ బాబు విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. 


ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో సుధీర్ బాబు యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టాడు. లవ్ అండ్ రివేంజ్ డ్రామాగా 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. మొత్తానికి తాజా ట్రైలర్ సినిమా మీద బాగా అంచనాలు క్రియేట్ చేస్తోంది. సుధీర్ బాబు లైటింగ్ సూరిబాబుగా కనిపించబోతున్న ఈ మూవీకి 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించగా, 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. 



Updated Date - 2021-08-19T17:43:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!