‘రిచి గాడి పెళ్లి’ ఫస్ట్ లుక్!
ABN , First Publish Date - 2021-07-02T23:13:21+05:30 IST
నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ జంటగా కె.ఎస్ హేమరాజ్ దర్శకత్వంలో కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రిచి గాడి పెళ్లి’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నటి ఐశ్వర్యా రాజేశ్ ఆవిష్కరించారు.

నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ జంటగా కె.ఎస్ హేమరాజ్ దర్శకత్వంలో కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రిచి గాడి పెళ్లి’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నటి ఐశ్వర్యా రాజేశ్ ఆవిష్కరించారు. ‘‘జీవితం అంటే భిన్నభావాల సమాహారం. వాటి వ్యక్తీకరణే మన జీవితపు దశాదిశా గమనాన్ని నిర్ణయిస్తుంది. ఈ చిత్రం మన దైనందిన జీవితంలో భావవ్యక్తీకరణ గురించి చెబుతున్నాం. ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న సినిమా ఇది. త్వరలో లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తాం’’ అని దర్శకుడు చెప్పారు.