రాజకీయ పార్టీలకు షరతులు వర్తించవా?

ABN , First Publish Date - 2021-12-27T23:02:54+05:30 IST

ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలో కర్ఫ్యూ నడుస్తోంది. ఫంక్షన్లు, సినిమా థియేటర్ల నిర్వహణ, సినిమా థియేటర్లపై అధికారులు ఆంక్షలు విధిస్తున్నాను. కొద్ది రోజులో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

రాజకీయ పార్టీలకు షరతులు వర్తించవా?

ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు చర్యలు  చేపడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలో కర్ఫ్యూ నడుస్తోంది. ఫంక్షన్లు, సినిమా థియేటర్ల నిర్వహణ, సినిమా థియేటర్లపై అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. కొద్ది రోజులో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పార్టీలు క్యాంపెయిన్‌కు సిద్ధం కానున్నాయి. ఒమిక్రాన్‌  ఉద్థృతంగా విస్తరిస్తోన్న వేళ రాజకీయ రాజకీయ పార్టీలు సభలె, ర్యాలీలు ఏర్పాటు చేయడంపై ఓ నెటిజన్‌ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. దీనిపై సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు.


‘‘వివాహాలు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, థియేటర్లు.. ప్రతి చోటా ఆంక్షలు విధించిన ప్రభుత్వం పొలిటికల్‌ ర్యాలీలపై మాత్రం ఎందుకు ఆంక్షలు విధించలేదు’’ అని ప్రశ్నించారు. ‘‘నాకు వచ్చిన అతిపెద్ద అనుమానం ఏమిటంటే.. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ నిర్వహించే రాత్రి కర్ఫ్యూ కారణంగా ఉద్థృతంగా విస్తరిస్తోన్న వైరస్‌ ఏ విధంగా తగ్గుముఖం పడుతుందో తెలియడం లేదు’’ అంటూ ఆర్జీవీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ‘కొండా’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. 


Updated Date - 2021-12-27T23:02:54+05:30 IST