‘ఆర్‌జివీ దెయ్యం’.. వచ్చేస్తోంది

ABN , First Publish Date - 2021-04-07T00:54:41+05:30 IST

వర్మ అంటే వివాదంతో పాటు చెప్పుకునేది ఏదైనా ఉంది అంటే.. అది ఖచ్చితంగా దెయ్యమే. వర్మకు దెయ్యాలంటే అంత పిచ్చి. అందుకే దెయ్యాల మీద కాస్త గ్యాప్‌ ఇచ్చినా సరే.. ఖచ్చితంగా

‘ఆర్‌జివీ దెయ్యం’.. వచ్చేస్తోంది

వర్మ అంటే వివాదంతో పాటు చెప్పుకునేది ఏదైనా ఉంది అంటే.. అది ఖచ్చితంగా దెయ్యమే. వర్మకు దెయ్యాలంటే అంత పిచ్చి. అందుకే దెయ్యాల మీద కాస్త గ్యాప్‌ ఇచ్చినా సరే.. ఖచ్చితంగా సినిమాలు చేస్తుంటాడు వర్మ. ‘రాత్’, ‘కౌన్’, ‘భూత్’, ‘ఫూంక్’ చిత్రాలతో భారతదేశంలో హర్రర్ చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన వ్యక్తిగా రామ్ గోపాల్ వర్మకు పేరుంది. మళ్ళీ ఇప్పుడు ‘ఆర్‌జివీ దెయ్యం’ అనే కొత్త దెయ్యం కథతో వస్తున్నాడు వర్మ. విశేషం ఏమిటంటే.. ఈ సినిమాలో యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్ కథానాయకుడిగా నటించడం. ఆయనతో పాటు స్వాతి దీక్షిత్, తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ తదితరులు ఈ చిత్రంలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 16న విడుదల చేయాలని చూస్తున్నారు.


ఈ సందర్భంగా దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘ఆర్‌జివీ దెయ్యం’ సినిమా వెండితెర ప్రమోషన్స్ మొదలు పెట్టాము. బాలీవుడ్ సినిమా ‘బ్రేకప్’లో రణధీర్‌కి జోడీగా నటించిన స్వాతి దీక్షిత్ ఇందులో రాజశేఖర్ కూతురి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో పెళ్లికావాల్సిన కూతురుకు తండ్రిగా రాజశేఖర్ నటించడమే కాక రాజశేఖర్ తన పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లో కనిపిస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. చూసిన ప్రేక్షకులందరినీ ఈ దెయ్యం భయపెడుతుంది.. అని తెలిపారు.

Updated Date - 2021-04-07T00:54:41+05:30 IST