సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఉగాదికి వెల్లడిస్తారా?

ABN, First Publish Date - 2021-04-08T06:32:07+05:30

ఉగాదికి ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో కొత్త సినిమా వివరాలు వెల్లడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాలీవుడ్‌ టాక్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉగాదికి ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో కొత్త సినిమా వివరాలు వెల్లడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం చిరంజీవి హీరోగా కొరటాల శివ ‘ఆచార్య’ తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. తమ తమ చిత్రాలను పూర్తి చేసిన తర్వాత... ఇద్దరి కాంబినేషన్‌లోని తాజా సినిమా సెట్స్‌ మీదకు వెళుతుందని తెలుస్తోంది. ఇటీవల ఎన్టీఆర్‌, కొరటాల శివ కలిశారు. ఓ స్ర్కిప్ట్‌ గురించి డిస్కస్‌ చేసుకున్నారట. ఎన్టీఆర్‌కి నచ్చడంతో ఓకే చెప్పారట. వాస్తవానికి, ‘ఆచార్య’ తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా కొరటాల శివ ఓ సినిమా చేయాలనుకున్నారు. ఆ మేరకు అధికారిక ప్రకటన సైతం వచ్చింది. అయితే, ‘పుష్ప’ చిత్రీకరణ అనుకున్న దానికంటే కాస్త ఆలస్యం అవుతుండటంతో అది పూర్తయ్యేలోపు ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని భావిస్తున్నారట. అదీ సంగతి!

Updated Date - 2021-04-08T06:32:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!