సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సీనియర్లు ‘నో’ అనడంతో రీషూట్‌!

ABN, First Publish Date - 2021-06-13T06:25:27+05:30

అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ సినిమా ‘వాలిమై’. కరోనా కారణంగా షూటింగ్‌కు సీనియర్‌ ఆర్టిస్టులు ‘నో’ చెప్పడంతో మళ్లీ రీషూట్‌ చేయాల్సి వచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ సినిమా ‘వాలిమై’. కరోనా కారణంగా షూటింగ్‌కు సీనియర్‌ ఆర్టిస్టులు ‘నో’ చెప్పడంతో మళ్లీ రీషూట్‌ చేయాల్సి వచ్చింది. ఈ విషయమై దర్శకుడు హెచ్‌. వినోద్‌ మాట్లాడుతూ ‘‘సినిమా ప్రారంభంలో చాలామంది సీనియర్‌ ఆర్టిస్టులతో మేం షూటింగ్‌ చేశాం. గత ఏడాది కరోనా కారణంగా చిత్రీకరణకు రావడానికి వాళ్లు నిరాకరించారు. దాంతో మేం కొత్త ఆర్టిస్టులతో షూటింగ్‌ చేయాల్సి వచ్చింది. అందువల్ల, ఇంకా కొంత షూటింగ్‌ బ్యాలెన్స్‌ ఉంది. కొత్త లొకేషన్లలో అనుమతి లభించిన వెంటనే సినిమా పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘వాలిమై’లో ఒక యాక్షన్‌ సీక్వెన్స్‌ విదేశాల్లో చిత్రీకరించాల్సి ఉంది. లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగించిన వెంటనే విదేశాలు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఖాళీ సమయంలో డబ్బింగ్‌ దాదాపుగా పూర్తి చేశారు. సినిమాకు తుది మెరుగులు దిద్దడమే బాకీ. ఇందులో సీబీ సీఐడీ అధికారి పాత్రలో అజిత్‌ కనిపిస్తారని కోలీవుడ్‌ టాక్‌.


Updated Date - 2021-06-13T06:25:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!