ఆ రోజులు గుర్తు చేసుకుంటూ...

ABN , First Publish Date - 2021-06-04T06:56:28+05:30 IST

ఆ రోజులు గుర్తుకొస్తున్నాయని రాశీ ఖన్నా అంటున్నారు. ఏ రోజులు అంటే... ఎటువంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా విహరించిన రోజులు! నటీనటుల జీవితం...

ఆ రోజులు గుర్తు చేసుకుంటూ...

ఆ రోజులు గుర్తుకొస్తున్నాయని రాశీ ఖన్నా అంటున్నారు. ఏ రోజులు అంటే... ఎటువంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా విహరించిన రోజులు! నటీనటుల జీవితం మూడు సినిమాలు, ఆరు షూటింగులతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది. కొన్నిసార్లు చిత్రీకరణలకు వివిధ దేశాలు వెళ్లి వస్తుంటారు. కానీ  ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. అందుకని, గతంలో వెళ్లొచ్చినప్పుడు పోగు చేసుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారట. కోపం కూడా వస్తోందట. ‘‘ట్రావిట్యూడ్‌... మనం ట్రావెలింగ్‌ మిస్‌ అయినప్పుడు... కోపం వచ్చినట్టు అనిపిస్తుంది కదా! అది. నన్ను మళ్లీ ఆ రోజుల్లోకి తీసుకువెళ్లండి’’ అని రాశీ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. కరోనా సెకండ్‌ వేవ్‌, వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా ప్రజలందరూ ఎటూ కదల్లేని పరిస్థితి. సెకండ్‌ వేవ్‌ సమయంలోనూ రాశీ ఖన్నా షూటింగ్‌ చేశారు. నాగచైతన్యకు జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘థాంక్యూ’ చిత్రీకరణకు ఇటలీ వెళ్లి వచ్చారు. ‘మనం’ తర్వాత విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం నిబంధనలు పాటిస్తూ ఇంట్లో ఉన్నారు. తెలుగులో ఈ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో గోపీచంద్‌ సరసన ‘పక్కా కమర్షియల్‌’ చేస్తున్నారామె. ఇవి కాకుండా తమిళంలో ఐదు, ఓ మలయాళ సినిమాలో నటిస్తున్నారు.

Updated Date - 2021-06-04T06:56:28+05:30 IST