ఏపీ ప్రభుత్వం చేస్తుంది తప్పు: రామ్ గోపాల్ వర్మ
ABN , First Publish Date - 2021-12-29T18:48:45+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరను తగ్గించడం నా దృష్టిలో పూర్తిగా తప్పు అని సంచలన దర్శకుడు అన్నారు. ఉత్పత్తిదారుల కి ధర నిర్ణయించుకునే హక్కు ఉంది. కొనాలా వద్దా అనే ది వినియోగదారుడు ఇష్టం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరను తగ్గించడం నా దృష్టిలో పూర్తిగా తప్పు అని సంచలన దర్శకుడు అన్నారు. ఉత్పత్తిదారుల కి ధర నిర్ణయించుకునే హక్కు ఉంది. కొనాలా వద్దా అనే ది వినియోగదారుడు ఇష్టం. టికెట్ ధర ఎంత ఉన్నా నచ్చిన వాళ్ళు చూస్తారు. నచ్చని వాళ్ళు మా నేస్తారు. సాధారణ కారు దరకు బెంజ్ కార్ ఇవ్వాలని అంటే ఎలా..! టికెట్ ధరలు తగ్గించడం ద్వారా ప్రభుత్వం కావాలనే ఇండస్ట్రీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందా, లేదా అనేది నాకు తెలియదు. సినిమా టికెట్ ధరలు తగ్గించడం వల్ల హీరోలకు నష్టం ఏమీ లేదు. ఇలాంటి చర్యల ద్వారా అగ్రహీరోల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అసాధ్యం. ప్రభుత్వం ఏం చేసినా హీరోల పారితోషికం తగ్గటం అనేది అసాధ్యం. టికెట్ ధరలు తగ్గించడం నిర్మాతలకు నష్టం. ముమ్మాటికి ఏపీ ప్రభుత్వం చేస్తుంది తప్పే.. అని వర్మ అన్నారు.
ఇక ఇదే సమయంలో ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆశ' చిత్రానికి సంబంధించి మాట్లాడుతూ.. "రేపిస్టులు తాలుకు స్వభావం ఆ సమయంలో వాళ్లు ప్రవర్తించిన విధానం వారి సైకాలజీ ఎలా ఉంది అనే దానిపై ఫొకస్ ఉంటుంది. ఇది కల్పిత కథ. అత్యాచారాల సమస్యలకు మూలం ఎక్కడుంది దానికి చట్టపరమైన శిక్షలు పరిష్కారం కాదు అనేది సినిమాలో చూపెట్టా" అని వర్మ తెలిపారు.