‘రెక్కీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

ABN , First Publish Date - 2021-12-28T00:16:41+05:30 IST

శ్రీమతి సాకా ఆదిలక్ష్మి సమర్పణలో స్నోబాల్ పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘రెక్కీ’. ‘కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్నారు. అభిరామ్ హీరోగా..

‘రెక్కీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

శ్రీమతి సాకా ఆదిలక్ష్మి సమర్పణలో స్నోబాల్ పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘రెక్కీ’. ‘కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్నారు. అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా.. క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు ఆవిష్కరించారు. 


ఈ సందర్భంగా.. క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్‌లో తెలుగుతెరపై ఇప్పటివరకు రాని కథాంశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో అత్యంత ఆసక్తికరంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని, టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి చేసుకుని, తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత కమలకృష్ణ తెలిపారు. ఈ చిత్ర రూపకల్పనలో ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ అందించిన మోరల్ సపోర్ట్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-12-28T00:16:41+05:30 IST