సంక్రాంతి సందడి ముందుగానే తెస్తోన్న 'క్రాక్'‌.. సెన్సార్‌ పూర్తి

ABN , First Publish Date - 2021-01-03T15:16:12+05:30 IST

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'క్రాక్‌'. సరస్వతి ఫిలింస్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి.మధు(ఠాగూర్‌ మధు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ పూర్తయ్యింది

సంక్రాంతి సందడి ముందుగానే తెస్తోన్న 'క్రాక్'‌.. సెన్సార్‌ పూర్తి

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'క్రాక్‌'. సరస్వతి ఫిలింస్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి.మధు(ఠాగూర్‌ మధు)  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సముద్ర ఖని, వరలక్ష్మి శరత్‌కుమార్‌ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. ముందు ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. అయితే సంక్రాంతి రేసులో నుండి క్రాక్‌ తప్పుకుంది. అయితే ఈ సినిమా సంక్రాంతి సందడిని మాత్రం ముందుగా తీసుకు రావడానికి సిద్ధమైంది. సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ పొందిన ఈ చిత్రం రిలీజ్‌ ప్రీ పోన్‌ అయ్యింది. జనవరి 9న సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. డాన్‌శీను, బలుపు సినిమాల తర్వాత రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 


Updated Date - 2021-01-03T15:16:12+05:30 IST