సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దుబాయ్‌లో డ్యాన్స్ చేస్తోన్న ‘ఖిలాడి’

ABN, First Publish Date - 2021-10-23T02:13:58+05:30

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రూపుదిద్దుకుంటోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఖిలాడి’. షూటింగ్ ముగింపు దశలో ఉన్న ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రూపుదిద్దుకుంటోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఖిలాడి’. షూటింగ్ ముగింపు దశలో ఉన్న ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రయూనిట్ దుబాయ్‌లో ఉంది. రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలపై అంద‌మైన‌ పాటను చిత్రీకరిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వ‌ర‌ప‌రిచిన ట్యూన్‌కు యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయబోతోన్నారు. శుక్రవారం పాట చిత్రీకరణ ప్రారంభమైనట్లుగానూ, దుబాయ్‌తో పాటు మస్కట్‌లోని కొన్ని ప్రదేశాల్లో ఈ పాటను చిత్రీకరించనున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంతో అల‌రించ‌నున్నారు. ప్లే స్మార్ట్ అనే ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌ సమర్పణలో తెరకెక్కుతోంది.

Updated Date - 2021-10-23T02:13:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!