డబుల్ ఇంపాక్ట్ ఇస్తానంటున్న రవితేజ
ABN, First Publish Date - 2021-01-01T15:05:45+05:30
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఖిలాడి'. పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఖిలాడి'. పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త ఏడాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో రవితేజ రెండు పాత్రల్లో కనిపిస్తున్నారు. ఒక రవితేజ కళ్లజోడుతో భయపడుతుంటే, మరో లుక్‌లో రవితేజ గన్ పట్టుకుని నిలుచున్నాడు. రవితేజ డబుల్ యాక్షన్ చేస్తున్న ఈ సినిమా నుండి డబుల్ ఇంపాక్ట్ పక్కా అంటూ యూనిట్ ఈ పోస్టర్‌ను విడుదల చేసింది. సినిమాను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.