ఇటలీలో ‘ఖిలాడి’ హల్‌చల్
ABN, First Publish Date - 2021-03-19T23:24:19+05:30
మాస్ మహారాజా రవితేజ.. 'క్రాక్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం 'ఖిలాడి'. 'రాక్షసుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ని అందుకున్న రమేష్ వర్మ దర్శకత్వంలో
మాస్ మహారాజా రవితేజ.. 'క్రాక్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం 'ఖిలాడి'. 'రాక్షసుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ని అందుకున్న రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ కోనేరు నిర్మాత. డా. జయంతీలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హవీష్ ప్రొడక్షన్ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి 'ప్లే స్మార్ట్' అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమా యాక్షన్ లవర్స్‌కు మంచి ట్రీట్ అవుతుందని ఇప్పటికే నిర్మాతలు చెప్పి ఉన్నారు. మే 28న 'ఖిలాడి'ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలోని అందమైన లొకేషన్లలో జరుగుతోందని, అక్కడ రవితేజ సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నామని చిత్రయూనిట్ అధికారికంగా తెలిసింది.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన వీడియో గ్లింప్స్, రిలీజ్ డేట్ పోస్టర్లు మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. రవితేజ సరసన మీనాక్షి చౌదరి మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్‌గా చేస్తుంది. ఉన్నత స్థాయి టెక్నికల్ విలువలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందిస్తుండగా.. సౌత్ ఇండస్ట్రీలోని నలుగురు టాప్ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, అన్బు-అరివు ఈ చిత్రానికి పని చేస్తుండడం విశేషం. అలాగే 'లూసిఫర్' ఫేమ్ సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.