మాస్ మహారాజా మాంచి ఊపుమీదున్నాడు
ABN , First Publish Date - 2021-01-19T00:05:41+05:30 IST
మాస్ మహారాజా రవితేజతో 'డాన్‌శీను, బలుపు' వంటి చిత్రాలను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని మూడవ చిత్రంగా 'క్రాక్'ని రూపొందించిన విషయం

మాస్ మహారాజా రవితేజతో 'డాన్‌శీను, బలుపు' వంటి చిత్రాలను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని మూడవ చిత్రంగా 'క్రాక్'ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం రీసెంట్‌గా సంక్రాంతి కానుకగా విడుదలై హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఈ చిత్రం రన్ అవుతోంది. ఇక ఈ చిత్ర విజయానందంలో ఉన్న రవితేజ.. కొద్దిగా గ్యాప్ తర్వాత తన తదుపరి చిత్ర షూటింగ్‌కి రెడీ అయ్యారు. రమేష్ వర్మ డైరెక్షన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రం 'ఖిలాడి'. ఈ చిత్ర షూటింగ్‌లోకి మళ్లీ ఎంటరైనట్లుగా తెలుపుతూ.. తాజాగా ఓ ఫొటోని రవితేజ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
''లైట్స్, కెమెరా, యాక్షన్.. నా తదుపరి చిత్రం 'ఖిలాడి' సెట్స్‌లో.. '' అంటూ రవితేజ షేర్ చేసిన పిక్‌లో షూటింగ్ వాతావరణం యమా రంజుగా ఉన్నట్లుగా కనబడుతోంది. రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. జయంతీలాల్ గడ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. 'ప్లే స్మార్ట్' అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది.