అడవిలో రవితేజ
ABN, First Publish Date - 2021-11-08T05:52:59+05:30
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలు. ప్రశాంత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు....
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలు. ప్రశాంత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ప్రస్తుతం మారేడుమల్లి అటవీ ప్రాంతంలో యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘యదార్థ సంఘటనల నేపథ్యంలో సాగే కథ ఇది. రవితేజ పాత్ర అటు మాస్‌నీ, ఇటు క్లాస్‌నీ ఆకట్టుకునేలా ఉంటుంది. వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తికావొచ్చింది. త్వరలో విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తామ’’న్నారు. నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: సామ్ సి.ఎస్.