రవితేజ... సమంతతో డిస్కస్‌ చేశా!

ABN , First Publish Date - 2021-02-02T06:59:52+05:30 IST

‘‘యాక్షన్‌, కామెడీ, డ్యాన్స్‌లతో హీరోగా పరిచయమవ్వాలని సినీ కుటుంబ నేపథ్యంతో వచ్చేవాళ్లకు ‘జాంబీరెడ్డి’ డ్రీమ్‌ డెబ్యూ అనొచ్చు...

రవితేజ... సమంతతో డిస్కస్‌ చేశా!

‘‘యాక్షన్‌, కామెడీ, డ్యాన్స్‌లతో హీరోగా పరిచయమవ్వాలని సినీ కుటుంబ నేపథ్యంతో వచ్చేవాళ్లకు ‘జాంబీరెడ్డి’ డ్రీమ్‌ డెబ్యూ అనొచ్చు. కథ గురించి రవితేజ, సమంతతో డిస్కస్‌ చేశా. కొందరు దర్శక, నిర్మాతలకు చెప్పా. కడప, కర్నూలులో జాంబీలు అనేసరికి అందరికీ విపరీతంగా నచ్చింది’’ అని తేజా సజ్జా అన్నారు. అతను హీరోగా నటించిన ‘జాంబీరెడ్డి’ శుక్రవారం విడుదల కానుంది. తేజా సజ్జా చెప్పిన సంగతులు...


కరోనాకి మందు తయారు చేద్దామని ఓ సైంటిస్ట్‌ ప్రయత్నిస్తాడు. అయితే, విరుగుడు కోసం వ్యాక్సిన్‌ వేసుకుంటే జాంబీ అవుతారు. ఈ జాంబీ వైరస్‌ జనాల్లో ఎలా వెళ్లింది? తర్వాత ఏమైంది? అనేది కథ. పక్కా కమర్షియల్‌ కామెడీ సినిమా. 


సినిమాలో నా పేరు మ్యారియో. ఓ గేమ్‌ డిజైనర్‌. నాకు లవ్‌ ట్రాక్‌ లేదు. 


ప్రస్తుతం సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌లో ‘ఇష్క్‌’ చేస్తున్నా. ప్రశాంత్‌ వర్మ కథతో ఫాంటసీ లవ్‌స్టోరీ ఒకటి చేస్తున్నా. దానికి ‘అద్భుతం’ టైటిల్‌ అనుకుంటున్నాం.

Updated Date - 2021-02-02T06:59:52+05:30 IST