మళ్లీ కలిసిపోయిన రవి, లాస్య
ABN , First Publish Date - 2021-01-03T19:49:19+05:30 IST
దాదాపు ఐదేళ్ల తర్వాత రవి, లాస్య కలిసి బుల్లితెరపై సందడి చేస్తున్నారు.

బుల్లితెరపై సమ్‌థింగ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా యాంకర్స్‌గా చేసిన రవి, లాస్యకు మంచి గుర్తింపు దక్కింది. అయితే తర్వాత ఏమైందో ఏమో కానీ.. వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని షో నుండి బయటకు వచ్చేశారు. తర్వాత లాస్య పెళ్లి చేసుకుని కొన్ని రోజులు బుల్లితెరకు దూరంగా ఉన్నారు. రీసెంట్‌గా బిగ్‌బాస్ 4లో పాల్గొన్న సంగతి తెలిసిందే. లాస్య రీ ఎంట్రీ తర్వాత రవి, లాస్య ఏదైనా షో చేస్తే బావుంటుందని చాలా మంది అనుకున్నారు. అందరూ అనుకున్నట్లే దాదాపు ఐదేళ్ల తర్వాత రవి, లాస్య కలిసి బుల్లితెరపై సందడి చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వీరిద్దరూ కలిసి ఓ షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి స్పెషల్ షోలో బెల్లంకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.