ఇన్ స్టాలో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన రష్మిక

ABN , First Publish Date - 2021-11-01T19:17:34+05:30 IST

టాలీవుడ్ లో అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ ఎదిగారు అందాల రష్మికా మందణ్ణ. ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం ఆమె ప్రత్యేకత. కెరీర్ బిగినింగ్ లో చిన్న హీరోలతో కథానాయికగా జెర్నీ మొదలుపెట్టిన రష్మికా.. ఇప్పుడు స్టార్ హీరోల సరసన కథానాయికగా నటించే స్థాయికి చేరుకోవడం సామాన్య విషయం కాదు.

ఇన్ స్టాలో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన రష్మిక

టాలీవుడ్ లో అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ ఎదిగారు అందాల రష్మికా మందణ్ణ. ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం ఆమె ప్రత్యేకత. కెరీర్ బిగినింగ్ లో చిన్న హీరోలతో కథానాయికగా జెర్నీ మొదలుపెట్టిన రష్మికా.. ఇప్పుడు స్టార్ హీరోల సరసన కథానాయికగా నటించే స్థాయికి చేరుకోవడం సామాన్య విషయం కాదు. లాస్టియర్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో స్టార్ హీరోయిన్ గా ప్రమోట్ అయిన ఆమె.. ప్రస్తుతం ‘అల్లు అర్జున్’  పుష్ప మూవీలో శ్రీవల్లిగా అదరగొట్టబోతోంది.  తెలుగు, తమిళ చిత్రలతో పాటు బాలీవుడ్ లోనూ కథానాయికగా నటిస్తోన్న ఆమెకి సోషల్ మీడియాలో కూడా అభిమానులతో టచ్ లో ఉంటుంది. వ్యక్తిగత విషయాలతో పాటు ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ మూవీస్ గురించి అప్టేట్స్ ఇవ్వడం ఆమె నిత్యకృత్యమైపోయింది. దాంతో ఆమెకి నెట్టింట ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇన్ స్టా ఆమెకి రికార్డు స్థాయిలో  ఏకంగా 23.3 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. కేవలం 394 ఇన్ స్టా పోస్టులతో అంత మంది ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం ఆమెకు మాత్రమే సాధ్యమైన రికార్డు. ఈ క్రెడిట్ దక్కించుకున్న ఏకైక హీరోయిన్ గా రష్మికా ఇన్ స్టాలో చరిత్ర సృష్టించింది. 

Updated Date - 2021-11-01T19:17:34+05:30 IST