రష్మిక మందన్న: ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానం

ABN , First Publish Date - 2021-10-18T14:03:24+05:30 IST

ప్రస్తుతం కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా రేంజ్ నేషనల్‌ లెవల్‌కి చేరుకుంది. కన్నడలో రూపొందిన 'కిరాక్‌ పార్టీ' అనే ప చిన్న సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈమె..ఇండస్ట్రీకొచ్చిన అతి కొద్ది కాలంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.

రష్మిక మందన్న: ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానం

ప్రస్తుతం కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా రేంజ్ నేషనల్‌ లెవల్‌కి చేరుకుంది. కన్నడలో రూపొందిన 'కిరాక్‌ పార్టీ' అనే ప చిన్న సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈమె..ఇండస్ట్రీకొచ్చిన అతి కొద్ది కాలంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. పూజా హెగ్డే, కీర్తి సురేశ్ లాంటి వారున్నా కూడా.. సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటూ బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను అందుకుంటోంది. కాగా ప్రస్తుతం ఫోర్బ్స్ భారతదేశంలో ‘అత్యంత ప్రభావవంతమైన నటుల’ జాబితాలో అగ్రస్థానాన్ని సంపాదించడ విశేషం.


ఈ రేసులో మరో స్టార్ హీరోయిన్ సమంతతో పాటు స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, యష్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి హీరోలను కూడా కిందకి నెట్టేసి టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. సౌత్ భాషల సినీ ప్రముఖులకు సోష‌ల్ మీడియాలో పెరిగిన ఫాలోవ‌ర్స్‌, లైక్స్, కామెంట్స్, వ్యూస్ లాంటి వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఈ లిస్ట్‌ను త‌యారు చేశారు. రష్మికకు 10 పాయింట్స్‌కు 9.88 పాయింట్లు వచ్చాయి. ఆ తర్వాత 9.67 పాయింట్స్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ రెండో స్థానంలో, 9.54తో క‌న్న‌డ హీరో య‌శ్ మూడో స్థానం నిలిచారు. 

Updated Date - 2021-10-18T14:03:24+05:30 IST