'రంగ మార్తాండ': డిసెంబర్‌లో విడుదలకి సన్నాహాలు
ABN , First Publish Date - 2021-09-22T14:28:58+05:30 IST
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందిస్తున్న తాజా చిత్రం 'రంగ మార్తాండ'. ఈ మూవీని డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు దర్శకుడు తెలిపారు.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందిస్తున్న తాజా చిత్రం 'రంగ మార్తాండ'. ఈ మూవీని డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ చిత్రం 'నట సామ్రాట్‌కి రీమేక్‌గా ఇది రూపొందుతోంది. రెండేళ్ల క్రితం షూటింగ్ మొదలు పెట్టిన ఈచిత్రం కరోనా వేవ్స్‌తో పాటు రకరకాల కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆగిపోయిందనే రూమర్స్ వచ్చి బాగా స్ప్రెడ్ అయ్యాయి. దానికితోడు మేకర్స్ నుంచి కూడా ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఈ వార్తలు నిజమే అని కూడా అనుకున్నారు. అయితే తాజాగా దర్శకుడు కృష్ణవంశీ 'రంగ మార్తాండ' చిత్రాన్ని.. అన్నీ అనుకూలిస్తే డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గతకొంత కాలంగా హిట్స్ లేని కృష్ణవంశీ 'రంగ మార్తాండ'తో భారీ హిట్ దక్కించుకుంటాడేమో చూడాలి. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
