రానా ‘విరాటపర్వం’.. రిలీజ్ డేట్ ఫిక్స్
ABN , First Publish Date - 2021-01-28T23:18:35+05:30 IST
భళ్లాలదేవుడు రానా, న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో

భళ్లాలదేవుడు రానా, న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్" అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ చిత్రానికి చిత్రయూనిట్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారులకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు, రానా బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్, సంక్రాంతి పర్వదినాన రిలీజ్ చేసిన రానా-సాయిపల్లవి జంట పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి రానా, సాయిపల్లవి కాంబినేషన్ అనగానే.. ఈ 'విరాటపర్వం'పై మొదటి నుంచి క్రేజ్ మాములుగా లేదు. రానా, సాయిపల్లవి జోడీ చూడచక్కగా ఉందని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని పాత్రల్లో రానా, సాయిపల్లవి నటిస్తున్నారు. మిగతా ముఖ్య పాత్రల్లో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కనిపించనున్నారు.
