Bhemlaa nayak: డానియేల్ శేఖర్ బర్త్ డే గిఫ్ట్ అదిరింది..

ABN , First Publish Date - 2021-12-14T16:18:07+05:30 IST

సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ 'భీమ్లా నాయక్'. తాజాగా ఈ సినిమా నుంచి రానా బర్త్ డే సందర్భంగా కొత్త లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా

Bhemlaa nayak: డానియేల్ శేఖర్ బర్త్ డే గిఫ్ట్ అదిరింది..

సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ 'భీమ్లా నాయక్'. తాజాగా ఈ సినిమా నుంచి రానా బర్త్ డే సందర్భంగా కొత్త లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు తెలుగు రీమేక్‌గా రూపొందుతోంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్స్. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా..ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2022, జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. కాగా, నేడు (డిసెంబర్ 14) రానా దగ్గుబాటి పుట్టినరోజు. ఈ సందర్భంగా 'భీమ్లా నాయక్' సినిమాలో ఆయన పోషిస్తున్న డానియేల్ శేఖర్ లుక్‌ను వదిలారు. ఈ లుక్‌లో రానా సిగరెట్‌ను వెలిగిస్తూ కనిపిస్తున్నాడు. చాలా పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రానా పాత్రకు సంబంధించిన టీజర్ కూడా ఈ రోజు సాయంత్రం గం.4:05నిమిషాలకు చిత్రబృందం రిలీజ్ చేయబోతోంది. 

Updated Date - 2021-12-14T16:18:07+05:30 IST