సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విరాటపర్వంలో రానా గానా!

ABN, First Publish Date - 2021-09-26T05:30:00+05:30

రానా దగ్గుబాటి గాయకుడిగా మారుతున్నారు. త్వరలో ఆయనో సినిమా పాట పాడనున్నారు. చిన్న పాటే అయినప్పటికీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రానా దగ్గుబాటి గాయకుడిగా మారుతున్నారు. త్వరలో ఆయనో సినిమా పాట పాడనున్నారు. చిన్న పాటే అయినప్పటికీ... ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటుందంటున్నారు వేణు ఊడుగుల. ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘విరాటపర్వం’. అందులో ప్రగతిశీల ఆలోచనలు, విప్లవాత్మక సాహిత్యంతో సాగే గీతానికి రానా గళం అయితే బావుంటుందనే ఆలోచన దర్శకుడికి వచ్చింది. హీరోతో ఆ విషయం చెప్పగా... పాడటానికి అంగీకరించారట. వచ్చే వారంలో సాంగ్‌ రికార్డింగ్‌ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. కథానాయికగా సాయి పల్లవి... ఇతర కీలక పాత్రల్లో ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌ తదితరులు నటించారు. మావోయిస్టు నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి యాక్షన్‌ దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని దర్శకుడు చెబుతున్నారు.

Updated Date - 2021-09-26T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!