రమేష్ గోపి కొత్త చిత్రం
ABN , First Publish Date - 2021-06-07T00:42:43+05:30 IST
శోభన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రమేష్, గోపిల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.

శోభన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రమేష్, గోపిల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్పీ క్రియేషన్ బ్యానర్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవంలో రచ్చ రవి, హీరో రామన్, విక్రమ్ , చంద్ర వట్టికూటి, మోహన్ , మధు పగడాల, డాక్టర్ కృష్ణమూర్తి, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రమేష్ గోపి మాట్లాడుతూ ‘‘మేము దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా ఇది. మేము ఇదివరకే హీరో తరుణ్ తో ‘ఇది నా లవ్ స్టోరీ’, ఆ తరువాత ‘రెడ్డి గారింట్లో రౌడీయిజం’ తీసాము, అది విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఈ మద్యే కన్నడలో ఓ సినిమా చేసాం, అది కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సో ఇది మా నాలుగో సినిమా. ఈ చిత్రం ద్వారా శోభన్ ను హీరోగా పరిచయం చేస్తూన్నాం. ఈ సినిమా లవ్, సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభించాం. లాక్ డౌన్ ఎత్తివేయగానే .. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఈ చిత్రానికి సంబందించిన మిగతా నటీనటుల టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిచేస్తాం’’ అన్నారు.