#RRR : ఓ రేంజ్‌లో రామ్‌చరణ్ ఇంట్రడక్షన్

ABN , First Publish Date - 2021-12-27T15:56:52+05:30 IST

ప్రస్తుతం ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న ఒకే ఒక సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి టేకింగ్, యన్టీఆర్, చరణ్ ల మాసీ పెర్ఫార్మెన్స్.. కీరవాణి సంగీతం వెరసి ఈ సినిమాకి భారీ హైపును క్రియేట్ చేశాయి. వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో జాతర ఖాయం అనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సింగిల్స్, ట్రైలర్ సినిమా మీద విపరీతంగా క్రేజ్ ను పెంచేశాయి. దానికి తగ్గట్టుగానే జక్కన్న ఈ సినిమా ప్రమోషన్స్ ను నెవర్ బిఫోర్ రేంజ్ లో చేపట్టాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ ఎంట్రీ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.

#RRR : ఓ రేంజ్‌లో రామ్‌చరణ్ ఇంట్రడక్షన్

ప్రస్తుతం ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న ఒకే ఒక సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి టేకింగ్, యన్టీఆర్, చరణ్ ల మాసీ పెర్ఫార్మెన్స్.. కీరవాణి సంగీతం వెరసి ఈ సినిమాకి భారీ హైపును క్రియేట్ చేశాయి. వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో జాతర ఖాయం అనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సింగిల్స్, ట్రైలర్ సినిమా మీద విపరీతంగా క్రేజ్ ను పెంచేశాయి. దానికి తగ్గట్టుగానే జక్కన్న ఈ సినిమా ప్రమోషన్స్ ను నెవర్ బిఫోర్ రేంజ్ లో చేపట్టాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ ఎంట్రీ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి సినిమాల్లో హీరోల ఇంట్రడక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో చెర్రీ ఎంట్రీ సీన్ అంతకు మించి అనే రేంజ్ లో ఉంటుందని రాజమౌళినే చెప్పారు.


తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లోని చెర్రీ ఎంట్రీ గురించి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే రేంజ్ లో వెల్లడించారు. దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్స్ కాంబినేషన్ లో చరణ్ ఎంట్రీ సీన్ ఉంటుందట. ఈ సీన్ సినిమాకే హైలైట్ కానుందని చెబుతున్నారు. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు తాను చాలా ఎగ్జైట్ అయ్యానని అంటున్నారు రాజమౌళి. ఈ సినిమాలో చాలా అద్భుతమైన సీన్స్ ఉన్నప్పటికీ చెర్రీ ఇంట్రో సీన్ కు వచ్చే రెస్పాన్సే వేరని అన్నారు. థియేటర్స్ లో ఈ సీన్ కు అభిమానుల రెస్పాన్స్ మామూలుగా ఉండదని జక్కన్న తెగ ఊరిస్తున్నారు. ట్రైలర్ లో ఈ సీన్ గురించి ఓ చిన్న కట్ ఉంటుంది. అందులో చెర్రీ పెర్ఫార్మెన్స్ ఏరేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. ఇదే సీన్ బిగ్ స్ర్కీన్ పై ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. మరి నిజంగానే ఆ సీన్ అంతలా పేలుతుందేమో చూడాలి. 

Updated Date - 2021-12-27T15:56:52+05:30 IST